Sakini Daikini Movie | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘శాకిని డాకిని’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Sakini Daikini Movie On Ott | క్యూట్ బ్యూటీ నివేథా థామస్, హాట్ బ్యూటీ రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన లేడీ మల్టీస్టారర్ చిత్రం 'శాకిని డాకిని'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడదులై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది.
Sakini Daikini Movie On Ott | క్యూట్ బ్యూటీ నివేథా థామస్, హాట్ బ్యూటీ రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రల్లో నటించిన లేడీ మల్టీస్టారర్ చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడదులై బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్’కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ఈ సినిమా షూటింగ్ గతేడాదే పూర్తయింది. అయితే కరోనా కారణంగా విడుదల ఆలస్యమువుతూ వచ్చింది. ఒకానొక టైంలో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే విడుదలవుందని వార్తలు వచ్చాయి. కాగా మేకర్స్ పుకార్లకు చెక్ పెట్టి సెప్టెంబర్15న థియేటర్లోనే విడుదల చేశారు. అయితే స్క్రీప్ట్ ఎంగేజింగ్‌గా ఉండకపోవడం, కథనం స్లోగా ఉండటం, కామెడీ అంతగా వర్కవుట్ అవడకపోవడంతో ప్రేక్షకులకు రుచించలేదు. దాంతో ఈ సినిమా వారంలోపే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది.
కాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా గతరాత్రి నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ విడుదలకు కేవలం రెండు వారాల్లోపే ఈ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ.౩ కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్‌గా కోట్టిన్నరకు పైగా కలెక్షన్లను సాధించి డిజాస్టర్‌గా మిగిలింది. దీనితో పాటుగా ఆర్య నటించిన ‘కెప్టెన్’ మూవీ జీ-5లో స్ట్రీమింగ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్‌తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

