Mahesh babu | ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఆ పాత్రను ముందుగా మహేష్‌బాబు చేశాడా?
Ponniyin Selvan Movie | ఇండియాలోని గొప్ప దర్శకులలో మణిరత్నం ఒకరు. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోల సైతం ఎదురు చూస్తుంటారు. ఈయన సినిమాల్లో డీటేయిలింగ్ గాని, విజన్ గాని వేరే లెవల్లో ఉంటాయి. అసలు పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసిందే మణిరత్నం.
Ponniyin Selvan Movie | ఇండియాలోని గొప్ప దర్శకులలో మణిరత్నం ఒకరు. ఈయనతో సినిమా చేయడానికి స్టార్ హీరోల సైతం ఎదురు చూస్తుంటారు. ఈయన సినిమాల్లో డీటేయిలింగ్ గాని, విజన్ గాని వేరే లెవల్లో ఉంటాయి. అసలు పాన్ ఇండియా సినిమాలు స్టార్ట్ చేసిందే మణిరత్నం. ‘రోజా’, ‘బోంబాయి’, ‘దిల్ సే’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయాలు సాధించాయి. అయితే గత కొంత కాలంగా ఈయన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘పొన్నియన్ సెల్వన్-1’ పైనే ఉన్నాయి. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాడు. చిత్రం నుండి విడుదలైన టైటిల్ పోస్టర్ నుండి ట్రైలర్ వరకు ప్రతీది ప్రేక్షకులలో భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మీ వంటి స్టార్ కాస్ట్ నటించింది. దాంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమా కథను మణిరత్నం ముందుగా దశాబ్ధ కాలం క్రీతమే ప్రకటించాడు. షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. అయితే కొన్ని కారణాలతో షూటింగ్ ప్రారంభంలోనే ఆగిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కాగా అప్పుడు మణిరత్నం వేరే నటీనటులతో సినిమాను ప్రారంభించారట. అప్పటి కాస్ట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉండటం విశేషం.
‘రాజరాజ చోళు’ని పాత్రలో నటించిన జయం రవి రోల్‌ను ముందుగా మహేష్‌బాబుతో స్టార్ట్ చేశారట. అప్పట్లో మహేష్‌బాబు కూడా ట్విట్టర్లో ‘నా డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. మణిరత్నం గారితో సినిమా చేస్తున్నాను’ అంటూ ఎగ్జైటింగ్‌గా ట్వీట్ చేశాడు. కాగా పలు కారణాలతో షూటింగ్ ఆగిపోయింది. ఇక ‘వంథియ దేవన్’ పాత్రలో నటించిన కార్తి రోల్‌ను మొదటగా విజయ్ థలపతితో షూట్ చేశారట. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా చెప్పాడు. కాగా అప్పుడు, ఇప్పుడు కరికాలన్‌గా విక్రమ్‌నే అనుకున్నాడట.
పీరియాడిక్ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. మొదటి భాగం ‘పొన్నియన్ సెల్వన్-1’ శుక్రవారం రోజున తమిళంతో పాటు, తెలుగు,మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. రెండో భాగం 6 నుండి 9 నెలల్లోపు విడుదల కానున్నట్లు మణిరత్నం ఇటీవలే వెల్లడించాడు. కాగా మొదటి భాగాన్ని మణిరత్నం కేవలం 150రోజుల్లోనే పూర్తి చేశాడట. ఏ.ఆర్ రెహమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
Read Also:
Sakini Daikini Movie | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘శాకిని డాకిని’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Naga Chaitanya | నాగచైతన్య సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

