Naga Chaitanya | నాగచైతన్య సినిమాలో కోలీవుడ్ స్టార్ నటుడు?
NC22 Movie | ప్రస్తుతం టాలీవుడ్ టైర్2 హీరోలలో నాగచైతన్య అగ్ర స్థానంలో ఉన్నాడు. 'లవ్‌స్టోరీ', 'బంగార్రాజు' వంటి సినిమాలతో వరుసగా 60కోట్లు కలెక్షన్లు సాధించి టాప్‌లో ఉన్నాడు. ఇటీవలే విడుదలైన 'థాంక్యూ' అక్కినేని అభిమానులను కాస్త నిరాశపరిచింది.
NC22 Movie | ప్రస్తుతం టాలీవుడ్ టైర్2 హీరోలలో నాగచైతన్య అగ్ర స్థానంలో ఉన్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో వరుసగా 60కోట్లు కలెక్షన్లు సాధించి టాప్‌లో ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ‘థాంక్యూ’ అక్కినేని అభిమానులను కాస్త నిరాశపరిచింది. ఇక ప్రస్తుతం ఈయన ‘మానాడు’ ఫేం విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో కోలీవుడ్ సీనియర్ హీరో నటించనున్నట్లు తెలుస్తుంది. ‘రోజా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అరవింద్ స్వామి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. తెలుగులో ఈయన రామ్‌చరణ్ ‘ధృవ’ సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఆరేళ్ళకు ఈ చిత్రంలో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.
Read Also:
Trivikram | ‘అత్తారింటికి దారేది’ తర్వాత ‘SSMB28’లో ఆ ప్రయోగం చేయనున్న తివిక్రమ్..!
VT12 | ఆసక్తి రేకిత్తిస్తున్న ‘వరుణ్‌తేజ్12’ స్పెషల్ వీడియో..!
Cobra Movie | చెప్పిన తేదీ కంటే ముందుగానే ఓటీటీలో విడుదలైన ‘కోబ్రా’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Aadi Saikumar | ఆసక్తికరంగా ఆది ‘CSI సనాతన్’ గ్లింప్స్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

