యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వింటేజ్ లవ్‌స్టోరీగా తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు తక్కువ సమయం ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే పాటకు సంబంధించి వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. విజువల్స్ చాలా గ్రాండియర్‌గా ఉన్నాయి. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. ఈ ప్రేమకథ చిత్రానికి జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సంగీతాభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా విడుదలైన సాంగ్ కూడా అలరిస్తుంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.