నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సంయుక్త మీనన్ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రంలో నిఖిల్ పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ప్రస్తుతం వియత్నాంలో యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కథానాయిక సంయుక్తమీనన్ పాత్ర తాలూకు ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. విగ్రహరూపంలో ఉన్న యువరాణిగా ఈ లుక్ ఆసక్తినిరేకెత్తిస్తున్నది.
ఒంటి నిండా ఆభరణాలు ధరించి, చేతిలో పక్షిని పట్టుకున్న ఈ పోస్టర్ సినిమా కథేమిటనే ఉత్సుకతను పెంచుతున్నది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, నిఖిల్ కెరీర్లోనే భారీ చిత్రంగా తెరకెక్కిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: భువన్, శ్రీకర్, రచన-దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి.