Samyuktha | మలయాళీ బ్యూటి సంయుక్త మరో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టింది. అయితే ఈసారి హీరోయిన్గా కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతుంది. ఈ భామ ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. గతేడాది భీమ్లా నాయక్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం నిఖిల్‌తో స్వయంభు అనే పాన్ ఇండియా సినిమా చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పట్టాలమీద ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసింది.
సంయుక్త లీడ్ రోల్లో ఒక న్యూ ఏజ్ యాక్షన్ డ్రామా రాబోతుంది. హాస్య మూవీస్ బ్యానర్లో రానున్న ఈ చిత్రం నేడు పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ వేడుకు ముఖ్య అతిథిగా వచ్చిన రానా దగ్గుబాటి క్లాప్ నివ్వగా.. నిర్మాతలు దిల్ రాజు, కోనా వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక ఈ సినిమాకు యోగేశ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
.@HasyaMovies Production No.6 with the most happening, @iamsamyuktha_ launched with an auspicious pooja ceremony !! pic.twitter.com/1L5GJNnIg0
— BA Raju’s Team (@baraju_SuperHit) October 9, 2024
కాగా ఈ సినిమాపై సంయుక్త మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో నేను ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రాబోతున్నాను. ఈ క్రెడిట్ అంతా మా మేనేజర్‌దే. నా స్టోరీలు మొదట ఆయనే ఎంపిక చేస్తారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నా అంటూ సంయుక్త చెప్పుకోచ్చింది.