Akhanda 2 Thaandavam | డాకు మహరాజ్(Daaku Maharaaj) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ 2(Akhanda 2)లో నటిస్తున్న విషయం తెలిసిందే. తనకు అచ్చొచ్చిన దర్శకుడు.. సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన బోయపాటి శ్రీను (Boyapati Srinu)తో మళ్లీ చేతులు కలిపాడు బాలయ్య. ఈ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘అఖండ 2 – తాండవం’ (Akhanda 2). బ్లాక్ బస్టర్ చిత్రం అఖండ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే మహకుంభమేళతో పాటు ఏపీ పరిసరాల్లో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి హీరోయిన్ని పరిచయం చేసింది చిత్రబృందం.
ఈ మూవీలో మలయాళ భామ సంయుక్త నటించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సంయుక్త పోస్టర్ని పంచుకుంది. ఇక ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట BB4 నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అఖండ తరువాత ఈ సినిమా వస్తుడటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం పొలిటికల్ టచ్‌తో ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
The talented and happening @iamsamyuktha_ is on board for #Akhanda2 – Thaandavam ✨
Shoot in full swing 💥
Grand release worldwide for Dussehra on SEPTEMBER 25th, 2025 ❤🔥
‘GOD OF MASSES’ #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @14ReelsPlus @RaamAchanta… pic.twitter.com/Snr685kUl7
— 14 Reels Plus (@14ReelsPlus) January 24, 2025