Dhanraj | జబర్దస్త్ షోతోపాటు సినిమాలతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధన్‌రాజ్ (Dhanraj). ఈ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పలు సినిమాల్లో కూడా నటించాడని తెలిసిందే. ధన్‌రాజ్ డైరెక్టర్‌గా మారబోతున్నాడన్న వార్తలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ కూడా చేస్తున్నాయి. ఇప్పుడీ వార్తలు నిజమయ్యాయి. దసరా పండుగ సందర్భంగా ధన్ రాజ్ డెబ్యూ ప్రాజెక్ట్ పూజాకార్యక్రమాలతో హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.
దర్శకుడిగా నా మొదటి ప్రయాణం.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ఉంటాయని కోరుతూ.. పూజా సెర్మనీ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు ధన్‌రాజ్. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోలో బ్రతుకే సో బెటర్ డైరెక్టర్ సుబ్బు కెమెరా స్విచాన్ చేయగా.. శివబాలాజీ క్లాప్ కొట్టాడు. తొలి షాట్‌కు బలగం వేణు గౌరవ దర్శకత్వం వహించాడు. తెలుగు స్క్రిప్ట్‌ను అమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర, తమిళ స్క్రిప్ట్‌ను డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ యూనిట్ మెంబర్స్‌కు అందజేశారు.
తెలుగు, తమిళ బైలింగ్యువల్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని (Samuthirakhani) ప్రధాన పాత్రలో నటిస్తుండం విశేషం. ఈ మూవీలో ధన్‌రాజ్, సముద్రఖని తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్, ఛమ్మక్ చంద్ర, తాగుబోతు రమేశ్, మధు నందన్, ఖయ్యూమ్, భూపాల్, పృథ్వి, రాకెట్ రాఘవతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో మోక్ష , హరీష్ ఉత్తమన్, పృద్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు.
Dhanraj1
రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృథ్వి పోలవరపు నిర్మిస్తున్నారు. మరి ధన్రాజ్ఎలాంటి స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేయబోతున్నాడోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
దర్శకుడిగా నా మొదటి ప్రయాణం .. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు, ఉంటాయని కోరుతూ….
Dhanrajkoranani✍️ pic.twitter.com/51Lekz3hCo
— Dhanraj koranani (@DhanrajOffl) October 22, 2023