శంభో శివ శంభో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నటుడిగా, డైరెక్టర్‌గా దగ్గరయ్యాడు కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని. ఈ ఏడాది పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన భీమ్లానాయక్, మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలతో మంచి బ్రేక్ అందుకున్నాడు. ఈ క్రేజీ యాక్టర్ కమ్ డైరెక్టర్ త్వరలో పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయనున్నాడని తెలిసిందే.
పవన్ లీడ్ రోల్లో తమిళ చిత్రం వినోదయ సీతమ్ (Vinodaya Sitham) రీమేక్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సముద్రఖని..దీనికి సంబంధించిన అప్డేట్ను అందరితో షేర్ చేసుకున్నాడు. రీసెంట్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..జులై నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు చెప్పాడు. టాలీవుడ్ (Tollywood) యువ హీరో సాయిధరమ్‌తేజ్ (Sai Dharam Tej) కీలక పాత్రలో నటిస్తున్నాడు. పవన్ దేవుడి పాత్రలో కనిపించనున్నాడని ఇన్ సైడ్ టాక్.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మళ్లీ ఎప్పటిలాగే డైలాగ్స్ అందించనున్నట్టు టాక్. సర్కారు వారి పాటలో సముద్రఖని పోషించిన పాత్రకు అద్బుతమైన స్పందన వస్తోంది. మరి పవర్ స్టార్‌ను సముద్రఖని ఎలా చూపించబోతున్నాడని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.