Isakapatnam Trailer | తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు ఉన్న యాక్టర్లు సముద్ర ఖని, ఐశ్వర్య రాజేశ్. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న చిత్రం ‘ఇసకపట్నం’. జులై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. కల్పిత పోర్ట్ టౌన్ బ్యాక్ డ్రాప్లో అధికారం, రాజకీయం, గ్యాంగ్ వార్స్, కుటంబ విబేధాల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ ప్రాజెక్టు ఉండబోతున్నట్టు ట్రైలర్ హింట్ ఇచ్చేస్తుంది. సరికొత్త తెలుగు ఒరిజినల్ క్రైం థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి.
గ్యారీ బీ హెచ్ డైరెక్టర్ చేసిన ఈ 7 ఎపిసోడ్స్ సిరీస్‌కు ప్రశాంత్రాఘతి స్టోరీ అందించాడు. బొర్రా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి నిర్మించారు. సునీల్, నరేశ్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, రాజీవ్‌కనకాల, బెనర్జీ, రోహిణి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ థ్రిల్లర్ సబ్ టైటిల్స్‌తో వరల్డ్ వైడ్‌గా సందడి చేయనుండం విశేషం.