Samuithirakani First Look Poster | నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. చాలా కాలం తర్వాత నితిన్ ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రముఖ ఎడిటర్ ఎమ్. ఎస్ రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇటీవలే ‘రా రా రెడ్డి’ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి సముద్రఖని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో రాజప్ప పాత్రలో సముద్రఖని నటిస్తున్నాడు. లేటెస్ట్గా విడుదలైన పోస్టర్లో సముద్రఖని నెరిసిన జుట్టు, మీసం కట్టుతో ఉన్నాడు. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నటించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటి నుండే వరుస అప్డేట్లతో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు.
Rajappa (@thondankani) ki elections undavvv.. Unanimous MLA of #MacherlaNiyojakavargam 💥💥
Grand Release Worldwide in Cinemas on August 12th! ⚠️🔥#MNVFromAug12th ✅@actor_nithiin @IamKrithiShetty @CatherineTresa1 @SrSekkhar @SreshthMovies #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/G0XnhE8sX5
— Sreshth Movies (@SreshthMovies) July 14, 2022