Sampoornesh babu| సాధారణంగా సినిమా పరిశ్రమలో రాణించాలి అంటే బ్యాక్ గ్రౌండ్ అయిన ఉండి ఉండాలి, లేదంటే చాలా హ్యాండ్సమ్గా ఉండి అద్బుతమైన టాలెంట్ ఉండి ఉండాలి. కాని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు రూటే సపరేటు. హృదయ కాలేయం అనే చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన టాలెంట్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ సమయంలో ఇతను హీరో ఏంటంటూ చాలా మంది విమర్శలు చేశారు. కాని వాటన్నింటిని పాజిటివ్‌గా మలచుకొని బర్నింగ్ స్టార్ అన్న బిరుదు కూడా సంపాధించుకున్నాడు సంపూర్ణేష్. అప్పట్లో వరుస సినిమాలు చేసిన సంపూ.. ఈమధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
సంపూర్ణేష్ సినిమాలు చేయకపోవడం పట్ల ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. చివరిసారిగా మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో కనిపించిన సంపూ మళ్లీ ఎందుకు సినిమాలు చేయడం లేదని ఎంక్వైరీలు చేశారు. ఇదే సమయంలో అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సోదరా అనే సినిమాతో పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్ కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సోదరా’ చిత్రీకరణ పూర్తిచేసుకుని ఏప్రిల్ 11న ఈ వేసవిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేయడానికి సిద్ధమవుతుంది.
మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై చాలా హృద్యంగా చూపించబోతున్నామని దర్శకుడు తెలియజేశారు. ఇంతక ముందు చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలకి మంచి స్పందన లభించింది. ఈ మూవీలో సోదరుల బంధాన్ని చాలా బాగా చూపించామని తెలిపారు. ఇక సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారని నిర్మాతలు తెలియజేశారు.ఈ సినిమాతో సంపూర్ణేష్ మంచి హిట్ కొట్టి తిరిగి బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.కాగా, తన కామెడీ పెర్ఫామెన్స్ లతో పాటు సినిమాల స్పూఫ్ లు.. హీరోలను ఇండైరెక్ట్ గా ఇమిటేట్ చేస్తూ.. బర్నింగ్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు సంపూ.