Sampoornesh Babu | దిగ్గజ దర్శకుడు రాజమౌళి పెట్టిన ఒక్క ట్వీట్‌తో నా జీవితమే మారిపోయిందని తెలిపాడు ప్రముఖ నటుడు సంపూర్ణేశ్ బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హృదయకాలేయం. ఈ చిత్రం విడుదలై నేటికి 11 ఏండ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో మాట్లాడాడు సంపూ.
నా తొలి చిత్రం హృదయకాలేయం విడుదలై 11 ఏండ్లు పూర్తిచేసుకుంది. నా జీవితంలో ఎవరికైన రుణపడి ఉన్నానంటే అది దర్శకుడు రాజమౌళి గారికే. ఆయన పెట్టిన ఒక పోస్ట్ వలన ఈరోజు మీ ముందు నటుడిగా నిలుచున్నాను. ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రేక్షకులను ఆనందపరిచేందుకు మరిన్ని ఉత్తమ చిత్రాలతో సన్నద్ధమవుతున్నట్లు సంపూర్ణేశ్ బాబు వెల్లడించారు.