2014లో హృదయ కాలేయం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బర్నింగ్ స్టార్‌గా అందరి హృదయాలను గెలచుకున్నారు సంపూర్ణేష్ బాబు. తనకంటూ ప్రత్యేక ట్రాక్ సెట్ చేసుకొని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన కొబ్బరి మట్ట సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రలలో కనిపించి అలరించాడు. తాజాగా బజార్ రౌడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాగా, ఇది ఆకట్టుకుంది.
ఇక ఈ రోజు సంపూర్ణేష్ బర్త్‌డే సందర్భంగా ఆయన మరో సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. క్యాలీ ఫ్లవర్ అనే టైటిల్‌తో సంపూ చిత్రాన్ని చేయనుండగా, ఈ చిత్రాన్ని ఆర్.కె.మలినేని దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సంపూ బ్రిటీషర్ పాత్రలో కనిపిస్తున్నాడు. వసంతి హీరోయిన్గా నటిస్తోంది. కామెడీ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను మధుసూదన క్రియేషన్స్ – రాధాకృష్ణ టాకీస్ బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు.
'Burning Star' @sampoornesh as the Grand Father of #𝐂𝐀𝐔𝐋𝐈𝐅𝐋𝐎𝐖𝐄𝐑
— BA Raju's Team (@baraju_SuperHit) May 9, 2021
🎬 #RKMalineni
🎵 #Prajwal
📽️ #MujeerMalik
💰 #AshaJyothiGogineni #MadhuSudhanaCreations #RadhaKrishnaTalkies#HBDSampoorneshBabu pic.twitter.com/FkNSsMezIn