Sampathraj | వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ నటన ప్రాధాన్యమున్న పాత్రలలో నటిస్తూ సినీరంగంలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు సంపత్ రాజ్. ‘బింబా’ అనే కన్నడ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంపత్‌రాజ్ ఇప్పటివరకు 100 కు పైగా సినిమాలలో నటించాడు. ‘దమ్ము’ సినిమాతో తెలుగులోకి ఎంట్రి ఇచ్చిన సంపత్ ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’, ‘లౌక్యం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వూలో ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఎప్పటినుంచి నటుడవ్వాలని అనుకున్నారు అనే ప్రశ్నకు.. ‘చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనుండేది కాని అవ్వలేని పరిస్థితని, మా అమ్మకు సినిమాలంటే ఇష్టముండదని, పని పాట లేని వాళ్లే సినిమాలకు వెళ్తారు అనే అభిప్రాయం ఉండేదని చెప్పుకొచ్చాడు. అలా సినిమాల్లోకి రాకుండా నన్ను మా అమ్మ ఆపేది. అలా సినీరంగంలోకి 20 సంత్సరాలప్పుడు రావాల్సింది 32 సంవత్సరాలకు వచ్చాను . నాకు మొదటి అవకాశం ఎలా వచ్చిందంటే మా ఫ్రెండ్ ఒకతను ‘బింబా’ సినిమాకు ఆడిషన్ ఇచ్చాడు కాని వాడు సెలక్ట్ అవ్వలేదు. దాంతో ఈ క్యారెక్టర్‌కు నేను సరిపోతానని భావించి వాడు నాకు ఫోన్ చేసి ఆడిషన్‌కు రమ్మనిపిలిచాడు. అందులో నేను సెలక్ట్ అయ్యాను.
నేనొక సెల్ఫిస్ యాక్టర్‌ని. నా దగ్గరికి ఎన్నో స్క్రిప్ట్ వస్తుంటాయి. ఒక సినిమా స్క్రిప్ట్ వినేటప్పుడు అందులో నా పాత్ర ఎంతుంది. ఎంత మంది నా క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుంటారు అనేది చూసుకుంటూ ప్రేక్షకులు నన్ను గుర్తించుకునే పాత్రలనే నేను ఎంచుకుంటా అంటూ వెల్లడించాడు. ఎస్పి చరణ్ నేను మంచి ఫ్రెండ్స్ మని చెప్పుకొచ్చాడు. ఇక త్రివిక్రమ్ రైటింగ్స్ అంటే చాలా ఇష్టమని, ఆయన సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌కు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుందని వెల్లడించాడు. ప్రస్తుతం ఈయన మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అరట్టు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.