Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన వ్యక్తిగత జీవితంతో పాటు ప్రొఫెషనల్ కెరీర్లోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గతేడాది ఆమె ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగ భైరవి ఆలయం సన్నిధిలో, అత్యంత సింపుల్‌గా ఈ వివాహం జరగడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పెళ్లి, సమంత తీసుకున్న స్పిరిచువల్ నిర్ణయానికి ప్రతీకగా నిలిచింది. పెళ్లి తర్వాత తొలి న్యూ ఇయర్‌ను సమంత–రాజ్ జంట ప్రత్యేకంగా జరుపుకుంది.
కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ఈ జంట పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి సమంత సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు, వీడియోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపించడంతో పాటు, భర్త రాజ్‌తో కలిసి కొత్త ఏడాదిని గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన తీరు అభిమానులను ఫిదా చేస్తోంది.ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. “సామ్ ఇలా హ్యాపీగా ఉండటం చూడటం చాలా ఆనందంగా ఉంది” అంటూ కామెంట్స్ చేస్తూ, ఆమెకు న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు. పెళ్లి తర్వాత సమంత జీవితంలో వచ్చిన పాజిటివ్ చేంజ్ స్పష్టంగా కనిపిస్తోందని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇక కెరీర్ పరంగా కూడా సమంత ఫుల్ బిజీగా ఉంది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ముందడుగు వేసిన ఆమె, ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు స్వయంగా నిర్మిస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనితో పాటు బాలీవుడ్‌లోనూ సమంత హవా కొనసాగుతోంది. రాజ్–డీకే ద్వయం తెరకెక్కిస్తున్న భారీ పీరియడికల్ వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండం’ లో సమంత కీలక పాత్రలో కనిపించనుంది. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి వంటి స్టార్స్‌తో కలిసి ఆమె నటిస్తుండటం విశేషం.
Unplanned moments will be one of those nights where boundaries quietly disappeared ❤️😍
Samantha with her husband and frnds at a celebration 😍 Happy New Year🔥#Samantha pic.twitter.com/ykKy16Gre3
— Dhruv Arjun (@Dhruv_Arjunan) January 1, 2026