‘బిగ్‌బాస్ స్క్రిప్టెడ్ కార్యక్రమం కాదు. అందులో జరిగేవన్నీ వాస్తవాలే’ అని అన్నారు విశ్వ. ‘బిగ్‌బాస్ రియాలిటీ షో’లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అతడు ఇటీవల ఎలిమినేట్ అయ్యాడు. ఈ షోలో తన ప్రయాణాన్ని గురించి విశ్వ శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘తెలుగు చిత్రసీమలో నా ప్రయాణం 2002లో మొదలైంది. పంతొమ్మిది ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా. ‘పెళ్లికోసం’, ‘విద్యార్థి’తో పాటు పలు సినిమాలు చేశా. నేను నటించబోయే ఓ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉండగా బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ షోతో ప్రతి కుటుంబానికి నేను చేరువయ్యా. ఇందులో లోబో నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా మారిపోయాడు. బిగ్‌బాస్ ఇచ్చిన బెస్ట్గిఫ్ట్ అదే. హౌస్ నుండి బయటకు రావడం నాకు ఇంకా షాకింగ్‌గానే ఉంది. ప్రేక్షకుల ఓటింగ్‌ను నేను స్వాగతిస్తున్నా. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా మళ్లీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే సిద్ధంగా ఉన్నా. శ్రీరామ్ ఈ షో విన్నర్ అవుతాడని నమ్ముతున్నా. నన్ను నేను మోసం చేసుకోవద్దని షోలో ఎప్పుడూ యాక్టింగ్ చేయలేదు. ఎవరికి నచ్చకపోయినా ఫర్వాలేదనే ఆలోచనతో ఎలాంటి ప్లాన్స్ లేకుండా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టా. మంచి కథల కోసం అన్వేషిస్తున్నా’ అని తెలిపారు.