Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ఛావా (Chhaava). ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహించగా.. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించాడు. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. అయితే ఈ సినిమాపై చరిత్రకారులు విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ అసలు కథ ఇది కాదని సినిమాలో ఒక వర్గంవైపు పాజిటివ్‌గా చూపించారని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
ఇదిలావుంటే శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj)పై హిందుత్వ నాయకులు, వీర్ సావర్కర్తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎమ్.ఎస్. గోల్వల్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ హిందూ జాతీయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ తన పుస్తకం అయిన “హిందూ పద్ పాదశాహీ” (Hindutva Pad-Padshahi)లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి ప్రస్తావించాడు. ఇందులో శంభాజీని మహాయోధుడిగా కొనియాడినప్పటికీ.. అతని వ్యక్తిగత జీవనశైలి.. పాలనా సామర్థ్యంపై వీర్ సావర్కర్ కొన్ని విమర్శలు చేశారు.
సావర్కర్ అభిప్రాయంలో.. శంభాజీ మహారాజ్ తన తండ్రి శివాజీ మహారాజ్ స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నడపలేకపోయారని తెలిపాడు. అలాగే అతడికున్న మద్యపానం అలవాటుతో పాటు స్త్రీల మీద వ్యామోహం వలన.. మారాఠా సామ్రాజ్యం పతనానికి దారితీసిందని తెలిపాడు. సావర్కర్ దృష్టిలో, శంభాజీ ఒక వీరుడైనప్పటికీ, హిందుత్వ ఆదర్శాలకు పూర్తి ప్రతీకగా నిలవలేకపోయారని రాసుకోచ్చాడు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) యొక్క రెండవ సర్సంఘచాలక్ అయిన ఎమ్.ఎస్. గోల్వల్కర్ (M. S. Golwalkar) కూడా శంభాజీ పాలనపై తన పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన పుస్తకం అయిన “బంచ్ ఆఫ్ థాట్స్” (Bunch of Thoughts)లో శంభాజీ గురించి ప్రస్తావిస్తూ.. శంభాజీ మహారాజ్ మహాయోధుడు అయినప్పటికీ అతని వ్యక్తిగత జీవనశైలి హిందూ సమాజం ఆదర్శాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన భావించారు. గోల్వల్కర్ దృష్టిలో ఒక ఆదర్శ హిందూ నాయకుడు క్రమశిక్షణ, నైతిక ఉన్నతి మరియు సామాజిక సమైక్యతను ప్రదర్శించాలి కానీ.. ఈ లక్షణాలు శంభాజీలో లోపించాయని ఆయన సూచించారు. అలాగే అతడు మద్యపానంకు బానిసై రాజ్యపాలన పట్టించుకోలేదని తెలిపాడు.
I have seen so much uproar about the Chaava Movie based on ficition and not facts..! But the fact here is that V.D.Savarkar wrote worst about him in His book..!
Why is there no outrage when Sambhaji Maharaj was called drunkard by Savarkar in His Book..! pic.twitter.com/tBnFlgEPLL— Tutankhamun – The Pharaoh (@NobleIndian2) February 18, 2025