అక్కినేని కోడలు సమంత తన పేరులో అక్కినేని తొలగించి కేవలం ఎస్ అనే లెటర్ని తన సోషల్ మీడియా నేమ్‌గా మార్చడంతో అందరిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. ఇటీవల తన పేరులో చేసిన మార్పు గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. తన చుట్టూ ఏర్పడ్డ వివాదాల గురించి తనకు నచ్చినప్పుడే మాట్లాడతానని చెప్పిన సమంత.. ఇలాంటి విషయాలపై తాను ఇప్పుడు స్పందించాలనుకోవడం లేదని తేల్చి చెప్పింది.
అంతేకాదు అక్కినేని కుటుంబంలో భాగం కావడం వల్ల కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు కదా అని ప్రశ్నించింది కూడా..! దీంతో గాసిప్ రాయుళ్లు పుకార్లు పుట్టించారు. చైతూతో సమంతకు ఏదో గొడవ జరిగిందని కొందరు కట్టు కథలు అల్లితే మరి కొందరు మామ, అత్తతో ఏవైన విబేధాలు వచ్చి ఉంటాయని పుకార్లు పుట్టించారు.
ఆ పుకార్లకు సమంత తన తాజా ట్వీట్‌తో చెక్ పెట్టింది. తన మామ నాగార్జున బర్త్ డే సందర్భంగా… మీ పట్ల నా గౌరవాన్ని వర్ణించడానికి పదాలు లేవు. ఈ రోజు,ఎల్లప్పుడు మీరు ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే మామ అంటూ సామ్ తన ట్వీట్లో తెలిపింది. దీంతో కొంత వరకు పుకార్లు కొంత బ్రేక్ పడ్డట్టే అని అంటున్నారు.