అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. భారీ పౌరాణిక చిత్రంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహాభారతంలోని ఆదిపర్వం నుండి తీసుకున్న శకుంతల, దుష్యంతుల ప్రేమ కథను ‘శాకుంతలం’ సినిమాతో వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు గుణశేఖర్ . ఇందులో ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్ మోహన్ నటించారు.
శాకుంతలం చిత్రం అభిమానులకి చాలా స్పెషల్ కానుంది. అందుకు కారణం ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అర్హ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక సమంత తన కెరీర్లో తొలిసారి పౌరాణిక పాత్రలో నటించడం విశేషం. చాలా ప్రతిష్టాత్మకంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ఈ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు పూర్తైంది. మంగళవారం విజయవంతంగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశామని పేర్కొంటూ అఫీషియల్ వీడియో రిలీజ్ చేసింది. దర్శకుడు గుణ శేఖర్, చిత్ర నిర్మాత నీలిమా యూనిట్ మొత్తానికి చిరు కానుకలు ఇచ్చారు.
చిత్ర బృందానికి వీడ్కోలు పలుకుతూ దర్శక నిర్మాతలు కాస్త ఎమోషనల్గా ఫీల్ కావడం ఈ వీడియోలో చూడొచ్చు. దిల్రాజు ప్రొడక్షన్స్, గుణటీమ్ వర్క్స్ పతాకాలపై పాన్ ఇండియా మూవీగా నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
It’s a wrap for #Shaakuntalam ! Owing to the extensive preproduction of 1 year we could wrap the shooting part in 5 months- I thank my team @GunaaTeamworks @neelima_guna for making this happen 🙏 thank you @Samanthaprabhu2 @ActorDevMohan @SVC_official pic.twitter.com/VYrFm2Tjlt
— Gunasekhar (@Gunasekhar1) August 24, 2021
“It’s a #WrapForShaakuntalam shoot!” 🤍 🐎 ⚔️https://t.co/8cOPS8wQU1#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/ohwwQqMLRs
— BA Raju's Team (@baraju_SuperHit) August 24, 2021