Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో స్టార్ హీరోయిన్గా మారింది. మొన్నటి వరకు కేవలం సౌత్ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితమైన ఈ అమ్మడు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో కూడా సత్తా చాటుతుంది. తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన వాటన్నింటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. సమంత ఇప్పుడు నిర్మాతగా మారి ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్ ని స్థాపించింది. ఈ బ్యానర్ పై ఆమె కొత్త వాళ్ళతో శుభమ్ అనే చిత్రం చేస్తుంది.మే 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి సమంత జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది.
చిత్ర ప్రమోషన్లో భాగంగా సమంత రీసెంట్గా నెల్లూరు లోని SV గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో నిర్వహించిన ఒక ఈవెంట్ లో పాల్గొంది. హీరోయిన్ గా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నటన గురించి పెద్దగా తెలియదని, తాను నటించిన మొదటి రెండు సినిమాలు ఇప్పుడు చూస్తే సిగ్గుగా అనిపిస్తూ ఉంటుందని సమంత పేర్కొంది. ఆ సినిమాలలో సమంత అంత దారుణంగా ఉంటుందని, వాటిని చూసినప్పుడల్లా నేను ఇంకా బాగా యాక్ట్ చేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది అని సమంత స్పష్టం చేసింది. శుభమ్ చిత్రం లో అందరూ కొత్తవాళ్లే నటించారు. కానీ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళు కొత్త నటీనటులుగా ఏ మాత్రం అనిపించరు.
వారి నటన నన్ను చాలా ఆకట్టుకుంది. ఎంతో అద్భుతంగా సినిమా ఉంటుంది. అందరి మనస్సులని హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో నటించిన నటీనటులు భవిష్యత్ళో పెద్ద రేంజ్కి వెళతారు అని నేను రాసిస్తాను అంటూ సమంత జోస్యం చెప్పింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఇదిలా ఉంటే ప్రవీణ్ కండ్రేగుల అనే నూతన దర్శకుడు శుభం చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రీయా వంటి వారు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా కొత్తవారే. టాలెంట్ ఉన్న వారిని సమంత ప్రోత్సహిస్తుండడం గొప్ప విషయం. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ను ఎదుర్కోవడం తనకు ఇష్టమని, అందుకే తాను నిర్మాతగా మారినట్టు సమంత పేర్కొంది.