Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ తన ప్రతిభను చాటుతోంది. అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలతో కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన సామ్, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. తాజాగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై సమంత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు ఇటీవలే ఘనంగా జరిగాయి.
సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను సమంతతో పాటు రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి నిర్మిస్తున్నారు. అదనంగా, సమంత బాలీవుడ్లో ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. అయితే, సినిమాలతో పాటు సామ్ బిజినెస్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే ‘సాకీ’ (Saaki) పేరుతో క్లాతింగ్ బ్రాండ్ విజయవంతంగా నడుపుతున్న ఆమె, ఇటీవలే పెర్ఫ్యూమ్ బిజినెస్‌లో అడుగు పెట్టింది. ఇప్పుడు మరోసారి కొత్త అడుగు వేసింది. తాజాగా సమంత ట్రూలీ స్మా( ‘Truly Sma’) అనే పేరుతో మరో క్లాతింగ్ బ్రాండ్ ప్రారంభించింది.
ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రమో వీడియోను షేర్ చేస్తూ “A New Chapter Begins” అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత కొత్త వెంచర్‌పై సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “సామ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా సక్సెస్ అవ్వాలి”, “Truly Samantha స్టైల్ ఎప్పుడూ యూనిక్‌గానే ఉంటుంది” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.