Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన సమంత ఈ మధ్య విడాకులు, మయోసైటిస్, రెండో పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇక నటిగా ఇన్నాళ్లు అలరించిన సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది. శుభం అనే చిత్రం సమంత నిర్మాణంలో రూపొందగా, ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక సమంత శుభం సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా కనిపించింది. పలు ప్రాంతాలు తిరుగుతూ మూవీని ప్రమోట్ చేసింది. పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో సమంత ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. తండ్రి అకాల మరణంతో దుఖాన్ని దిగమింగి అభిమానులతో సంతోషంగా ఉండాల్సిన ఓ సందర్బం తనకు ఎదురైందని సామ్ పేర్కొంది
సమంత తండ్రి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసారు. తండ్రి చనిపోయిన విషయాన్ని తల్లి వెంటనే ఫోన్ చేసి సమంతకి చెప్పింది. ఆ మాట వినగానే సమంతకి గుండె పగిలినంత పని అయింది.. అయితే అప్పటికే తండ్రితో కొంత కాలంగా సమంత మాట్లాడటం లేదు. దీంతో ఆరోజు ఏం జరుగుతుందో తనకి అర్దం కాలేదని పేర్కొంది. అయితే తన తండ్రి చనిపోయినప్పుడు సమంత ముంబైలో ఉంది. విషయం తెలిసి వెంటనే బయల్దేరగా మధ్యలో చాలా మంది అభిమానులు కనిపించి ఫోటోలు కావాలని అడిగారు. అయితే వాళ్ల మాట కాదనకలేక నవ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. లోలోపల తండ్రి చనిపోయాడన్న దుఖం ఉబికి వస్తున్నా కూడా దానిని అదుపు చేసుకుని ఫోటోలకి పోజులిచ్చినట్టు తాజా ఇంటర్వ్యూలో తెలియజేసింది.
అభిమానుల వల్లే నేడు ఈ స్థానంలో ఉన్నట్లు కూడా గుర్తు చేసుకుంది సమంత. ఇక చైతూ నుండి విడిపోయిన తర్వాత సింగిల్‌గా ఉంటుంది సమంత. ఈ మధ్య రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకానొక సందర్బంలో వారిద్దరూ చేతులు పట్టుకున్న పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. రీసెంట్గా సామ్ తిరుపతి విజిట్ చేసినప్పుడు ఆ సమయంలో కూడా రాజ్ .. సమంత వెంటే ఉన్నారు. సామ్ ప్రొడ్యూసర్‌గా మారిన శుభం సినిమాకు కూడా పనిచేశారు మిస్టర్ నిడిమోరు. ఇలా ఇద్దరు ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్న నేపథ్యంలో వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని కామెంట్ చేస్తున్నారు.