టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శాకుంతలం. అక్కినేని సమంత (Samantha) లీడ్ రోల్ చేస్తోంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ సినిమాగా గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ బయటకు వచ్చింది. సమంత తన పాత్ర షూటింగ్ ను పూర్తి చేసినట్టు ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. గుణశేఖర్, దేవ్ మోహన్ తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ..శాకుంతలంలో నా పాత్ర చిత్రీకరణ ముగిసిందని చెప్పింది సామ్.
ఒక చిన్న అమ్మాయిగా నేను అద్భుత కథలను నమ్మాను. అవి పెద్దగా మారలేదు. నా అద్భుతమైన గాడ్ ఫాదర్ గుణశేఖర్ సార్ నా కలను నిజం చేసినందుకు సంతోషంగా ఉందంటూ శాకుంతలం ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చింది. గుణశేఖర్ నాకు కథ చెప్పినపుడు..నేను వెంటనే చాలా అందమైన ప్రపంచంలోని వెళ్లిపోయాను. శాకుంతలం లాంటి ప్రపంచం మరొకటి లేదు. సెల్యూలాయిడ్ మీద అలాంటి అందమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యమేనా..? అనిపించింది. కానీ మొదట కొంత నర్వస్, భయంగా ఫీలయ్యా. గుణ శేఖర్ సార్ నా అంచనాలకు మించిన ప్రపంచాన్ని సృష్టించారు.
నాలో ఉన్న చిన్నారి సంతోషంతో డ్యాన్స్ చేస్తోంది..ధన్యవాదాలు సార్. ఇవాళ అందరికి గుడ్ బై చెప్తున్నా. గుణ శేఖర్ పట్ల అపారమైన ప్రేమ, కృతజ్ఞతా భావం ఉంటుందని సమంత ట్వీట్ చేసింది. శాకుంతలం చిత్రంలో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీ, తమిళ భాషలలో నిర్మితమవుతుంది.
An absolute pleasure to see you become our “Shakuntala”, can’t wait for the world to witness your portrayal. Thank you @Samanthaprabhu2 🤍#Shaakuntalam @Gunasekhar1 @ActorDevMohan @neelima_guna @GunaaTeamworks @DilRajuProdctns @SVC_official #MythologyforMilennials #EpicLoveStory pic.twitter.com/Hu7fA6HP6t
— Gunaa Teamworks (@GunaaTeamworks) August 12, 2021