అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా అనంతరం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా సమంత నటించనుంది. తాజాగా ఈ చిత్ర కథాంశం గురించి ఆసక్తికరమైన ఓ విషయం బయటికొచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘రోజా’ (1992) తరహాలో కశ్మీర్ నేపథ్యంలో నడిచే కథ ఇదని సమాచారం. ‘రోజా’ ఇతివృత్తాన్ని సమకాలీన ట్రెండ్‌కు అనుగుణంగా తీర్చిదిద్ది దర్శకుడు శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని అంటున్నారు. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర చిత్రణ కూడా కొత్త పంథాలో ఉంటుందని తెలిసింది.