దక్షిణాదిలో విజయవంతమైన కెరీర్ నిర్మించున్న సమంత ఏళ్లపాటు అగ్రతారగా వెలిగింది. సౌత్‌లో స్టార్ హీరోలతో వరుస చిత్రాల్లో నటించింది. ఈ బిజీలో దక్షిణాది దాటి బయట అడుగుపెట్టలేదు. తీరిక లేక గతంలో వచ్చిన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా చేయలేకపోయింది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘పుష్ప’ సినిమాలు ఆమెకు బాలీవుడ్‌లోనూ పేరు తీసుకొచ్చాయి. ఇక్కడిలాగే అక్కడా అభిమానులను, పాపులారిటీని అందించాయి.
దీంతో ఆమెకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ క్యూ కడుతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ చేసిన ‘సిటాడెల్’ హిందీ రీమేక్ ఇప్పటికే సెట్స్ మీద ఉండగా…తాజాగా మరో క్రేజీ మూవీ ఆఫర్ దక్కింది. దినేష్ విజన్ మ్యాడాక్ ఫిలింస్ సంస్థలో రాబోతున్న హారర్ కామెడీలో సమంత నాయికగా ఎంపికైంది. ఈ సంస్థ గతంలో ‘స్త్రీ’, ‘బేడియా’ వంటి విజయవంతమైన హారర్ చిత్రాలను నిర్మించింది. ఈ సినిమాలో ఆమె యువరాణి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తున్నది. ఆయుష్మాన్ ఖురానా వ్యాంపైర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారు. యువరాణిగా సమంత పాత్ర ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం చెబుతున్నారు. ప్రస్తుతం సామ్…‘ఖుషీ’, ‘శాకుంతలం’, ‘యశోద’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది.