Samantha Wedding | టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ జంటకు సెలబ్రీటీలు శుభాకాంక్షలు తెలుపుతుండగా రాజ్ మాజీ భార్య రచయిత్రి శ్యామలి దేవి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. బరితెగించిన వ్యక్తులు (Desperate People) దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్టోరీ వైరల్గా మారింది.
మరోవైపు సమంత – రాజ్ నిడిమోరుల వివాహం ఈశా యోగ సెంటర్లో ఘనంగా జరిగింది. వీరిద్దరూ భూత శుద్ధి సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈశా యోగా కేంద్రంలో సద్గురు ప్రాణప్రతిష్ట చేసిన లింగ భైరవి విగ్రహం ముందు భూత శుద్ధి విధానంలో పెళ్లి జరిపించారు. భావోద్వేగాలు, భౌతికపరమైన అంశాలకు అతీతంగా దంపతులు మధ్య ప్రగాఢ బంధాన్ని ఏర్పరచడానికి తయారుచేసిన విశిష్టమైన విధానమే ఈ భూత శుద్ధి వివాహమని ఈశా ఫాండేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. పంచభూతాలను శుద్ధి చేసి వివాహబంధంలో అన్యోన్యత, ఆధ్యాత్మికత, మనశ్శాంతి వెల్లివిరిసేలా చేయడమే ఈ భూత శుద్ధి విధానంలోని పరమార్థమని ఈశా ఫాండేషన్ తెలియజేసింది.

Raj Ex Wife Shymali