Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవల మయోసైటిస్ వ్యాధితో కొన్నాళ్లు బాధపడింది సమంత. దాని వలన సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు నటిగా మళ్లీ బిజీ అయింది. అలానే నిర్మాతగాను సత్తా చాటాలని భావిస్తుంది. ఇప్పుడు సమంత నిర్మించిన శుభం చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సమంత కొద్ది రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాలలో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది.
ఇక సమంత సినిమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమెకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవల ఒక అభిమాని ఆమెపై ఉన్న అభిమానంతో ఏకంగా గుడి కట్టాడు . బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ నటి సమంతకు వీరాభిమాని కాగా, ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం, ఆపదలో ఉన్నవారికి తన వంతు సాయం వంటి వాటికి ఆకర్షితుతడయ్యాడు. దాంతో గుడి కట్టాలని నిర్ణయించి 2023 ఏప్రిల్ 28న తెనాలి లో గుడిని ప్రారంభించాడు సందీప్. ప్రతి సంవత్సరం సమంత పుట్టినరోజు సందర్భంగా సందీప్ అనేక సేవా కార్యక్రమాలు చేయటంతో పాటు అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఇటీవల సమంత బర్త్ డే సందర్భంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాడు.
అయితే ఇప్పటి వరకు సమంత తనకి కట్టిన గుడి గురించి స్పందించలేదు. రీసెంట్గా శుభం ప్రమోషన్లో మాట్లాడింది. ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అని అనుకున్నా. నాకు ఇప్పుడు ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు . కాకపోతే ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్దతిని మాత్రం నేను ఎంకరేజ్ చేయలేను అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఇక సమంత ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రం చేస్తుండగా, ఈ మూవీని జూన్ నుంచి మళ్లీ షూట్‌కు తీసుకెళతాం. షూట్ స్టార్ట్ అయ్యాక మళ్లీ అప్డేట్లు వస్తాయని సమంత పేర్కొంది.