Samantha | సినీ రంగంలో పోటీతత్వాన్ని తాను పాజిటివ్‌గా తీసుకుంటానని, మరింత కష్టపడి పనిచేయడానికి అదొక ప్రేరణగా పనిచేస్తుందని అగ్ర కథానాయిక సమంత అభిప్రాయపడింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్’ జాబితాలో సమంత 13వ స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..
‘ప్రతీ రంగంలో పోటీ ఉంటుంది. నేను నా సహనటీనటులను చూసి స్ఫూర్తి పొందుతాను. వారిలా విజయాలు సాధించాలంటే మరింతగా కష్టపడాలని అనుకుంటాను. పోటీతత్వం మనలోని సృజనాత్మక శక్తులను వెలికితీస్తుంది. పోటీ ఉంటేనే మన ప్రతిభ మరింతగా మెరుగుపడుతుందని భావిస్తాను’ అని చెప్పింది. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తున్నది. స్వీయ నిర్మాణ సంస్థలో ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది.