Samantha | నటిగా తన సత్తా చాటిన సమంత నిర్మాతగాను తొలి విజయం దక్కించుకుంది. సమంత నిర్మించిన శుభం చిత్రం ఇటీవల విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ద్వారా కొంతమంది కొత్త నటీనటులను..సైతం ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కెరీర్లో సమంత ఎప్పుడు టాప్‌లోనే ఉంది. అయితే పర్సనల్ లైఫ్ మాత్రం కాస్త డిస్ట్రబ్ అయింది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్‌గా ఉంటుంది సమంత. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. గత కొంతకాలంగా సమంత వైవాహిక జీవితం గురించి నెట్టింట అనేక వార్తలు వస్తున్నాయి.
అందుకు కారణం సమంత ఇటీవల రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్లిన సమంత పక్కన రాజ్ ఉంటున్నాడు. త్వరలో వీరిద్దరు వివాహం చేసుకోవడం ఖాయమని కొందరు జోస్యాలు చెబుతున్నారు. రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లి కాగా.. ఆ కారణంగా సమంతతో వివాహం ఆలస్యమైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. రాజ్ నిడిమోరు తెలుగు వ్యక్తి కాగా, ఆయన ఇటీవల సమంతతో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తీసాడు. ఇక శుభం చిత్రం కోసం సామ్‌తో కలిసి పని చేసినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా సమంత తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇందులో రాజ్‌పై సమంత వాలినట్టుగా కనిపిస్తుంది. దీంతో వారి బాండింగ్ రోజు రోజుకి బలపడుతుందిగా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
సమంత నిర్మించిన శుభం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల 25 లక్షల గ్రాస్ రాబట్టిన నేపథ్యంలో సమంత సోషల్ మీడియాలో తన సంతోషం వ్యక్తం చేసింది. శుభం సినిమాని మాతో కలిసి చూసి, అనుభూతి చెంది, సెలబ్రేట్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా తొలి అడుగు, కొత్త కథలు ముఖ్యమైనవనే నమ్మకానికి ఆజ్యం పోసింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రయాణం శుభంతో ప్రారంభమైంది. ఇది శుభారంభం అంటూ సమంత తన పోస్ట్‌కి కామెంట్‌గా పెట్టింది. ఇక టీంతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు, ప్రేక్షకుల స్పందనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, సినిమాపై తన తల్లి రియాక్షన్ వీడియోని పోస్ట్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.