Samantha | టాలీవుడ్ స్టార్ హీరో సమంత కొన్ని సంవత్సరాల క్రితం నాగ చైతన్య నుండి విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఎవరు ఊహించని విధంగా విడిపోయారు. విడాకుల తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నా సమంత మాత్రం సింగిల్‌గా ఉంటుంది. ఆ మధ్య మయోసైటిస్ బారిన పడ్డ సమంత సినిమాలకి కూడా బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. సమంత నిర్మాతగా కూడా యాక్టివ్ అవుతోంది. సమంత తన సొంత బ్యానర్ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో శుభం చిత్రం నిర్మించగా, ఈ చిత్రం మే 9న రిలీజ్ కి రెడీ అవుతోంది.
గత కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో యాక్టివ్‌గా ఉంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంది. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లోను సమంత పాల్గొంది. అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టాలో కొన్ని ఆసక్తికర ఫొటోలు పంచుకుంది. దానికి కామెంట్‌గా చాలా పెద్దదారే దాటి కానీ ఈసారి బలంగా తయారయ్యాను.. ఇక కొత్త ప్రయాణం మొదలైంది.. అంటూ చివరిగా శుభం సినిమా రిలీజ్ డేట్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేసింది . అయితే సమంత షేర్ చేసిన ఒక ఫొటోలో ఆమె దర్శకుడు రాజ్ తో కనిపించింది.. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సమంత అతనితో ఉన్న ఫొటోలు షేర్ చేయడం అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తుంది.
కొంతకాలంగా సమంత.. రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు తెగ ప్రచారం నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో వీరిద్దరూ జంటగా కూడా కనిపించారు. రాజ్ నిడిమోరు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుల్లో రాజ్ ఒకరు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత విలన్ గా నటించింది. అదే విధంగా రాజ్ తెరకెక్కించిన హనీ బనీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఆ సమయంలో వీరి మధ్య పరిచయం మొదలై అది ప్రేమగా మారిందని అంటున్నారు. మరి వీరి రిలేషన్ ఏంటనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు.