Samantha – Raj | నటి సమంత ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈషా యోగ కేంద్రంలో సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ పెళ్లితో గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ప్రేమ రూమర్లకు చెక్ పెట్టినట్టు అయింది. ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం కూడా ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ, సమంత స్నేహితులు ఒక్కొక్కరుగా కొన్ని ఎక్స్‌క్లూజివ్ చిత్రాలు బయట పెడుతున్నారు.
సమంతకు సన్నిహిత స్నేహితురాలు మేఘన వినోద్, పెళ్లి వేడుకలో తీసిన పలు అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. వాటిలో ముఖ్యంగా కొన్ని ఫొటోలు వైరల్ అవుతుండగా, నెటిజన్స్ వాటికి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే పెళ్లికి ముందు సమంత గోరింటాకు పెట్టుకుంటూ ఉండగా తీసిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతుండగా, అందులో గోరింటాకు డిజైన్లను రాజ్ నిడిమోరుకి చూపిస్తూ సమంత మురిసిపోతున్న పిక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక రాజ్ కూడా తన ఫోన్లోని హెన్నా డిజైన్స్‌ను సమంతకు చూపిస్తుండడం మనం గమనించవచ్చు.
ఈ ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే నిజమైన ప్రేమ క్షణం,పెళ్లికి ముందు ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారంటే…, ఇలా సమంత హ్యాపీగా కనిపించడం మాకు ఆనందంగా ఉందంటూ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. కాగా, సమంత గతంలో నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్ల పాటు ఈ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. కాని ఏం జరిగిందో ఏమో తెలియదు కాని చైతూ, సమంతలు విడాకులు తీసుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. కొద్ది రోజులు క్రితం చైతూ.. శోభిత దూళిపాళ్లని ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే.