Subham | అగ్ర నటి సమంత నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం ‘శుభం’. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రధారులు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. మే 9న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందినట్టు ట్రైలర్ చెబుతున్నది.
ఊళ్లోని స్త్రీలంతా సీరియల్ చూస్తూ దెయ్యం పట్టినట్టు వింతగా ప్రవర్తిస్తుంటే, వారినుంచి తప్పించుకునేందుకు పురుషులంతా అష్టకష్టాలు పడుతున్నారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. ట్రైలర్లో సడెన్ ఎంట్రీ ఇచ్చేసి సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశారు సమంతా. మొత్తంగా ట్రైలర్ నవ్విస్తూ, భయపెడుతూ ఉత్కంఠభరితంగా సాగింది. హాస్యం, హారర్, ఎమోషన్స్.. ఇలా అన్ని అంశాల కలగలుపుగా ‘శుభం’ రూపొందినట్టు అర్థమవుతున్నది. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: వివేక్ సాగర్, సంగీతం: క్లింటన్ సెరెజో.