Samantha | కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి (Samantha).. మల్లేశం, బలగం సినిమాలతో హీరోగా మార్కులు కొట్టేశాడు. ఈ ఏడాది డార్లింగ్స్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించిన ప్రియదర్శి ప్రస్తుతం సారంగపాణి జాతకం చిత్రంలో నటిస్తున్నాడు. కాగా మరోవైపు సిటడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది సమంత ( Priya darshi). ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుందన్న వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అయితే ఈ ఇద్దరు హీరోహీరోయిన్లుగా కనిపిస్తారనుకుంటున్నారా..? కాదు. తాజా టాక్ ప్రకారం ప్రియదర్శితో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందట సామ్. ఈ భామ ఇప్పటికే ప్రొడక్షన్ హౌస్‌ను షురూ చేసిందని తెలిసిందే. దీని ద్వారా తెలుగు యాక్టర్లతో సినిమాలు చేయాలనుకుంటున్నట్టు టాక్. ఇప్పటికే ప్రియదర్శితో సినిమాను తెరకెక్కిస్తుందట. హోం ప్రొడక్షన్స్‌లో లిమిటెడ్ బడ్జెట్లో సినిమాలు తీసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మరోవైపు తన ప్రొడక్షన్ హౌస్‌కు నాన్ థ్రియాట్రికల్ డీల్స్‌తో ఫండింగ్ సమకూరేలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను సామ్ టచ్‌లోకి తీసుకుందని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. మొత్తానికి ఇప్పటిదాకా హీరోయిన్‌గానే అలరించిన సామ్ ఇక మీదట మంచి నిర్మాతగా కూడా మారనుండటంతో ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు సినీ జనాలు.
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్
Matka | కూల్ స్పాట్ క్లబ్ చూశారా..? వరుణ్ తేజ్ టీం నుంచి మట్కా నయా గ్లింప్స్