Samantha | నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతలో చాలా మార్పు వచ్చింది. ఇటీవల అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది. ఆమె చేసే ఫోటో షూట్లు దుమారం రేపుతున్నాయి. తనకు గ్లామర్ షోలో ఎలాంటి హద్దుల్లేవని చాటుకుంటోంది సామ్. ఈ మధ్య సమంత ముంబైలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక టైట్ డ్రెస్‌లో ఆమె చేస్తున్న రచ్చ మాములుగా లేదు. బీటౌన్ హీరోయిన్స్ ని బీట్ చేసేలా సమంత డ్రెస్సులు ధరిస్తుంది. ఇటీవల ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జిమ్ సెషన్ ముగిసిన తర్వాత కారు ఎక్కేందుకు వెళుతుంది. ఆ సమయంలో ఫొటో గ్రాఫర్స్ సమంత వెనక పడ్డారు. అయితే ఆ సమయంలో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది కానీ, ఎవరితో మాట్లాడాలో అర్థం కానట్టుంది. తనని ఫాలో అయ్యే ఫొటోగ్రాఫర్స్‌ని “స్టాప్ ఇట్ గైస్!” అంటూ హెచ్చరించింది.
ప్రస్తుతం సమంతకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, అందులో ఆమె ఫోన్లో మాట్లాడుతూ, తన కార్ కోసం వెతుకుతూ, ఫోటోగ్రాఫర్లను హెచ్చరించే విధానం స్పష్టంగా కనిపిస్తోంది.ఇటీవల సమంత తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ ఇస్తూ, తరచూ జిమ్ సెషన్ల వీడియోలు ,ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. టైట్ డ్రెస్‌లో సమంత చేసే గ్లామర్ రచ్చ కూడా నెట్టింట వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఎప్పటికప్పుడు తన హెల్త్, మూవీస్ గురించి అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.
మయోసైటిస్ వలన గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం తాను మానసికంగా ఎంతో దృఢంగా, సంతోషంగా ఉన్నట్టు సమంత పేర్కొంది.. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్న సమంత, ప్రస్తుతం తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించారు. శుభం అనే సినిమాతో నిర్మాతగా మారిన సమంత ఆ చిత్రంతో మంచి హిట్ కూడా అందిపుచ్చుకుంది. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు, హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించనున్నారు.