Samantha vs Naga Chaitanya | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉంది సమంత. అక్కినేని కుటుంబానికి దూరం అయినా కూడా అభిమానులు మాత్రం ఇప్పటికీ సమంతను అదే స్థాయిలో గౌరవిస్తున్నారు. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత మొదటిసారి మాజీ భర్త సినిమాతో పోటీ పడుతుంది సమంత. ఆగస్టులో అక్కినేని హీరోలు ఇద్దరు బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి వస్తున్నారు. అదే సమయంలో తన సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ మాజీ అక్కినేని కోడలు.
నాగ చైతన్య కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలపై కూడా ఇప్పుడు ఫోకస్ చేశాడు. ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్లో నటిస్తున్న మొదటి సినిమా లాల్ సింగ్ చెడ్డా. అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ ఆగస్టు 12న విడుదల కానుంది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్లో మొదటి విజయం అందుకున్న అఖిల్.. ఏజెంట్ సినిమాతో మరో విజయం అందుకోవాలని కసి మీద ఉన్నాడు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముటి కీలక పాత్రలో నటిస్తున్నాడు. అక్కినేని అన్నదమ్ములు వరుస రోజుల్లో వస్తుంటే సమంత కూడా తన సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగుతుంది.
ఆగస్టు 12న సమంత నటిస్తున్న యశోద సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది ఈ సినిమా. అప్పట్లో చైతు నటించిన శైలజా రెడ్డి అల్లుడు, సమంత యూ టర్న్ సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు పోటీకి రెడీ అయ్యారు సమంత, చైతన్య. మొత్తానికి ఆగస్టు 11, 12వ తేదీల్లో బాక్సాఫీస్ దగ్గర అక్కినేని జాతర జరగనుంది. అందులో మాజీ అక్కినేని కోడలు కూడా జాయిన్ కానుంది మరి అన్నదమ్ములు సినిమాల మధ్య యశోద ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
సమంత, అఖిల్ ఫిట్నెస్ వెనుక ఉన్నది ఇతనే.. బాలీవుడ్ స్టార్స్ కూడా ఈయన శిష్యులే”
“Samantha Chaitu Poster | సామ్ ఇన్ స్టా స్టోరీస్‌లో చైతూ పోస్టర్..సర్ప్రైజ్ ఏంటో ..?”
“Samantha | ముంబైకి మకాం మార్చుకుంటున్న సమంత..!”
Samantha | బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న సమంత.. పారితోషికం విషయంలో నో కాంప్రమైజ్”