Samantha Ruth Prabhu | ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీబిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఇటీవలే బ్రేక్ తీసుకుందని తెలిసిందే. ప్రస్తుతం బాలి హాలీడే ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ ట్రిప్‌లో భాగంగా ప్రఖ్యాత ఉలువటు టెంపుల్ (Uluwatu Temple)ను సందర్శించింది. తన వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో అందరితో పంచుకుంటోంది. అయితే తన ట్రిప్‌లో ఓ ముఖ్యమైన వస్తువును కోల్పోయింది సామ్. ఆ వస్తువేంటనుకుంటున్నారా..? సన్‌గ్లాసెస్.
ఇంతకీ వాటిని ఎత్తుకెళ్లిందని ఎవరో తెలుసా..? సామ్ సన్గ్లాసెస్పై కన్నేసింది కోతి. ఈ విషయాన్ని చోరీ జరిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న సమంత ఓ అరుగుపై కూర్చొని కెమెరాకు ఫోజులిస్తుండగా.. వెనుకవైపు నుంచి కోతి చూస్తున్న స్టిల్ ఒకటి షేర్ చేసింది. చివరిసారి నా ఛాయలు (షేడ్స్) చూశా. అతడి (కోతినుద్దేశిస్తూ)కి నిజంగా మంచి అభిరుచి ఉంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడీ ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. సమంత ప్రస్తుతం లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తున్న ఖుషిలో నటిస్తోంది.
ఇప్పటికే విడుదలైన పాటలు నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి. మరోవైపు హిందీలో వరుణ్ ధవన్‌తో కలిసి సిటడెల్ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కతున్న Chennai Story లో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
View this post on Instagram
A post shared by Q ᴜ ᴇ ᴇ ɴ 🖤⃝💖〲 S ᴀ ᴍ ᴀ ɴ ᴛ ʜ ᴀ 👸🏻 (@samantha_admirer___)