Samantha | మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత యాక్టింగ్ నుంచి కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు సమంత ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆమె తిరిగి నటించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సమంత. ఇందులోనే తన ఆరోగ్య పరిస్థితిని కూడా వెల్లడించింది. త్వరలో మళ్లీ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్’ తర్వాత సమంత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. యూఎస్‌లో మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ ఇన్‌స్టా స్టోరీలతో టైంపాస్ చేసింది. ఆమె ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. దీంట్లో వరుణ్ ధావన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది సమంత. విదేశీచిత్రం ‘చెన్నై స్టోరీస్’ కూడా ఆమె సంతకం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.