అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ముఖ్యంగా వారిద్దరి సోషల్‌మీడియా ఖాతాలపై నెటిజన్లు ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. విడిపోయాక వారి మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే సామాజిక మాధ్యమాలే మార్గమని భావిస్తున్నారు. విడాకుల అనంతరం సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన తాజా పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ‘నేను ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే తొలుత నన్ను నేను మార్చుకోవాలి. పడకగదిని నేనే సర్దుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మధ్యాహ్నం వరకు నిద్ర పోకుండా ఉండాలి. ముఖ్యంగా పగటి కలలకు స్వస్తిపలికి ముందున్న లక్ష్యాల గురించి ఆలోచించాలి’ అని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. విడాకుల తాలూకు అలజడి నుంచి త్వరలోనే బయటపడి కెరీర్‌పై దృష్టిపెట్టాలనే భావనతో సమంత పెట్టిన ఈ పోస్ట్ పట్ల ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి సారించాలని హితవు పలుకుతున్నారు. సమంత నటిస్తున్న తెలుగు చిత్రం ‘శాకుంతలం’ ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది.