Samantha | సమంత పోరాటం ఇంకా ముగియలేదు.. జీవితాంతం నరకం తప్పలేదా?
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో ఎదురైన వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు ఆమెను ఎంతో ఇబ్బందికి గురి చేశాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, ఆ తర్వాత అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్‌తో చేసిన పోరాటం గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే. తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి సమంత ఆరోగ్య పరిస్థితిపై చర్చకు దారితీశాయి.
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో ఎదురైన వ్యక్తిగత, ఆరోగ్య సమస్యలు ఆమెను ఎంతో ఇబ్బందికి గురి చేశాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, ఆ తర్వాత అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్‌తో చేసిన పోరాటం గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే. తాజాగా దర్శకురాలు నందిని రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి సమంత ఆరోగ్య పరిస్థితిపై చర్చకు దారితీశాయి. కొన్ని సంవత్సరాల క్రితం సమంత తనకు మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధి కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు. ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు ఆమె సినీ కెరీర్‌కు కూడా విరామం ఇచ్చారు. అనంతరం చికిత్స అనంతరం మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి సమంత ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె మాటల్లో.. మయోసైటిస్ కారణంగా సమంత గత రెండేళ్లుగా చాలా కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్‌ను అనుసరిస్తున్నారని తెలిపారు. ఉప్పు, రుచి వంటి వాటికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, వ్యాధి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేమని, అది మళ్లీ తీవ్రతరం కాకుండా ఉండేందుకు ఇప్పటికీ ఆహార నియమాలను కచ్చితంగా పాటిస్తున్నారని వెల్లడించారు. నందిని రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సమంత ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే కెరీర్‌ను కొనసాగించడం, జీవితంలో ముందుకు సాగేందుకు ప్రయత్నించడం నిజంగా అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో సమంత వ్యక్తిగత జీవితం, వివాహం, గర్భధారణకు సంబంధించిన అనేక ప్రచారాలు కూడా వైరల్ అవుతున్నాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా, ఆరోగ్య సమస్యలతో సుదీర్ఘ పోరాటం చేసినా సమంత వెనక్కి తగ్గలేదు. చికిత్సతో పాటు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తూ తిరిగి కెమెరా ముందుకు రావడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని, జీవితాన్ని కొత్తగా మలచుకోవచ్చని సమంత తన ప్రయాణంతో నిరూపించారని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

