సమంత ఇప్పుడు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు నిర్మాత కూడా. ఈ మధ్యే ఓ నిర్మాణ సంస్థను మొదలు పెడుతున్నట్లు ప్రకటించింది ఈ బ్యూటీ. ఇప్పటికే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సమంత.. త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతానికి అయితే సినిమాలకు దూరంగా ఉంటూ.. కేవలం యాడ్స్ మాత్రమే చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఏడాది బ్రేక్ అనౌన్స్ చేసింది కాబట్టి అనుకున్నట్లుగానే ఆ బ్రేక్ యూజ్ చేసుకుంటుంది స్యామ్. త్వరలోనే మళ్లీ సినిమాలు చేయాలని చూస్తున్నా కూడా అవకాశాలు మంచివి వచ్చినపుడే ఓకే చేస్తాను అంటుంది. అనవసరంగా చిన్న సినిమాలు.. తన స్థాయికి సరిపోని సినిమాలు చేసి ఉన్న పేరు చెడగొట్టుకోలేనంటూ ఓపెన్‌గానే చెప్పేస్తుంది సమంత. అందుకే సినిమాలకు దూరంగా అయినా ఉంటాను కానీ పిచ్చి ప్రాజెక్ట్స్ మాత్రం ఓకే చేయనంటుంది. అన్నట్లుగానే తెలుగు నుంచి రెండు మూడు సినిమాలు వచ్చినా కూడా నో చెప్పేసింది ఈ భామ.
అలాగే తమిళం నుంచి కూడా ఒకట్రెండు సినిమాలకు నో అనేసింది. ప్రస్తుతం ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే ఉంది. అక్కడ్నుంచి హాలీవుడ్ వెళ్లాలని చూస్తుంది సమంత. అందుకు తగ్గట్లుగానే సినిమాలు కూడా సైన్ చేయాలని చూస్తుంది. ఇప్పటి వరకు అయితే ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు సమంత. మధ్యలో ఇంత ఖాళీ టైమ్ దొరకడంతో నిర్మాణ సంస్థ మొదలుపెట్టింది. ఈమె నిర్మాణ సంస్థకు కూడా ఆసక్తికరమైన పేరు పెట్టింది సమంత. ఓ పాత పాప్ ఆల్బమ్ ఆధారంగా ట్రాలాల బ్యానర్ అని పెట్టింది. ముందు ఇది ప్రకటించినపుడు అసలేం పేరు ఇది అని అంతా సర్చ్ చేసారు. కానీ తర్వాత తెలిసింది ఇది సమంతకు ఫేవరేట్ పాప్ ఆల్బమ్ అని. అందుకే తన బ్యానర్‌కు అదే పేరు పెట్టుకుంది సమంత. తాను చిన్నప్పట్నుంచి ఆ పాట విని పెరిగానని.. అందుకే ఆ పాటపై ఉన్న ప్రేమతోనే తన బ్యానర్‌కు కూడా ఇదే పేరు పెట్టినట్లు చెప్పింది స్యామ్.
ఇందులో కొత్త వాళ్లకు ఎక్కువగా ఛాన్సులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది స్యామ్. మంచి కథలు వస్తే ఎవరికైనా అవకాశం ఉంటుందని చెప్తుంది ఈ భామ. ప్రస్తుతానికి సినిమాల కంటే కూడా ఓ షో ప్లాన్ చేస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. తమిళంలో ఓ షో ప్లాన్ చేస్తుంది సమంత. ముందు టెలివిజన్‌కు దగ్గరైన తర్వాత సినిమాలు చేయాలనుకుంటుంది. ఈ లోపు మంచి కథలు తీసుకొస్తే సినిమాలు నిర్మించడానికి కూడా తనకేం అభ్యంతరం లేదని చెప్తుంది ఈ బ్యూటీ. ఇప్పటికైతే షోతో తన నిర్మాణ సంస్థ మొదలు పెడుతుంది స్యామ్. మరి సినిమాలు ఎప్పుడు మొదలవుతాయనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ అది కూడా త్వరలోనే జరుగుతుందని నమ్మకంగా చెప్తుంది ఈ బ్యూటీ. అందులో తాను నటిస్తుందా లేదా పూర్తిగా కొత్త వాళ్ళతోనే ముందుకు వెళ్తుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది.