Samantha | మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న సమంత జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. నాగ చైతన్య నుండి విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడడం, సినిమాలకి దూరం కావడం జరిగింది. మయోసైటిస్ తర్వాత సమంత జీవితం కుదుపులకి లోనైంది. సినిమాలు కాస్త తగ్గించిన సమంత సోషల్ మీడియాలో సందడి చేయడం, పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు తెలియజేడంతో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తాను 20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. అప్పట్లో సక్సెస్ అంటే.. ఎన్ని ప్రాజెక్ట్‌లు చేశాం. ఎన్ని యాడ్స్ చేస్తున్నాం. ఎన్ని పెద్ద బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నామనే దానిపైనే ఉండేదన్నారు.
అప్పట్లో పలు మల్టీ నేషనల్ బ్రాండ్స్‌కి కూడా అంబాసిడర్‌గా చెప్పిన సమంత.. ఉత్పత్తులను ప్రమోట్ చేసే సమయంలో ఎంతో బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది.ఏడాదిలో 15 బ్రాండ్స్ వదులుకున్నానని , ఇప్పటికీ నాకు ఎన్నో ఆఫర్స్ వస్తుంటాయని, కాకపోతే అన్ని ఆఫర్లను నేను అంగీకరించనని సమంత కామెంట్లు చేశారు. వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే తాను కొత్త బ్రాండ్స్‌కి ఓకే చెబుతానని అంటుంది. మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతూనే అప్పట్లో షూటింగ్స్ చేశానని పేర్కొంది సమంత. అది ఓ తీవ్రమైన అనుభవం.. కానీ ఇప్పుడు బలంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
సమంత ‘సిటడెల్: హనీ బన్నీ’ తర్వాత ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించారు. ఇక సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకోసం ఎక్కువ సమయం కేటాయిస్తుంది సమంత. సెల్ఫ్ లవ్, మహిళా సాధికారత, వ్యక్తిగత సంరక్షణ వంటి విషయాల్లో స్పష్టమైన అభిప్రాయాలతో తన అభిరుచులకు అనుగుణంగా జీవిస్తూ ఇన్‌స్టాలో పలు సందేశాలు అందిస్తూ వస్తుంది సామ్.