సమంత మాటల్లో ఆత్మాభిమానం అడుగడుగునా గోచరిస్తూ ఉంటుంది. ‘జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్నీ పాఠంలా తీసుకొని పరిపూర్ణమైన మనిషిని అయ్యాను’ అంటున్నది నటి సమంత. ఇటీవల తన జీవితంలో ఎదురైన క్లిష్టపరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిందామె. ‘విడాకులు అనే విషయాన్ని సమాజం ఎందుకు ఇలా భూతద్దంలో చూస్తుందో అర్థం కాదు. పైగా ఈ విషయంలో స్త్రీకి జరుగుతున్న డ్యామేజీ పురుషుడికి జరగడం లేదు.
డీవోర్స్ తీసుకున్నది అనగానే ఆమెకు సమాజం కొన్ని ట్యాగ్స్ తగిలించేస్తుంది. సెకెండ్ హ్యాండ్, యూజ్డ్.. ఇలా ఆమె జీవితం వృథా అన్నట్టు మాట్లాడతారు. మీడియా కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఎత్తి చూపుతూ ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడల్లా మనుషులు కంటే పశువులే నయం అనిపిస్తుంటుంది.
ఇలాంటి కామెంట్స్ ఆ స్త్రీని, ఆమె కుటుంబాన్నీ ఎంత బాధిస్తాయో వాళ్లకర్థం కాదు. నా గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారు. అవన్నీ అబద్ధాలు కాబట్టే వాటిపై స్పందించలేదు. నా స్నేహితులకు, నా కుటుంబ సభ్యులకు నేనేంటో తెలుసు. వారి మద్దతే నన్ను నిలబెట్టింది.’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.