Samantha | అగ్ర కథానాయిక సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. తరచు అభిమానులతో సంభాషిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానమిస్తుంది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో అభిమానులతో ముచ్చటించింది సమంత.
కొన్ని సినిమాల ఎంపిక విషయంలో తాను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, అందుకే ఆశించిన విజయాలు దక్కలేదని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘కొంతకాలంగా అదృష్టం కలిసి రావడం లేదు. కథల ఎంపికలో నేను చేసిన తప్పుల వల్ల విజయాలకు దూరమయ్యాను. నా ఫెయిల్యూర్స్‌ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా. కొన్ని చిత్రాల్లో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాననే బాధ కూడా ఉంది. అపజయాల నుంచి పాఠాలు నేర్చుకున్నా. ఇక నుంచి ప్రతీ సినిమాను ఓ సవాలుగా స్వీకరిస్తా. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తా’ అని చెప్పింది. ఆమె నటించిన హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’ ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది