Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తుంది. నటిగా మంచి మార్కులు కొట్టేసిన సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా అదృష్టం పరీక్షించుకోబోతుంది. ఆమె తాజాగా శుభం అనే చిత్రంలో అతిథి పాత్ర పోషించి, ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మే 9న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తన హోమ్ బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ కావడంతో సమంత కూడా చాలా యాక్టివ్గా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటుంది.
ఆదివారం సాయంత్రం ‘శుభం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. సమంతతో సహా నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా సామ్ మాట్లాడుతూ.. వైజాగ్ లో ఈవెంట్స్ జరుపుకున్న తన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయని , ఇది కూడా విజయం సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. మూవీ చూశాక అందరు కూడా చిరు నవ్వుతోనే బయటకు వస్తారని పేర్కొంది. ప్రమోషనల్ కంటెంట్ చూసి హరర్ కామెడీ అని అనిపిస్తుంది కాని, ఇది వేరే సినిమా అంటూ పేర్కొంది. నేను నటించిన ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘రంగస్థలం’ సినిమా ఈవెంట్స్ ఇక్కడే జరిగాయి. ఇక్కడికి వస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని సమంత అన్నారు.
ఇక సమంతని చూసేందుకు చాలా మంది జనాలు వచ్చారు. ఇక తన అభిమానులని అలరించేందుకు శుభం సినిమాలోని పాటకి సమంత స్టెప్పులు వేసింది. సమంతతో పాటు ఈ పాటల నటించిన వారు కూడా తమదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించారు. ఇక ఈ ఈవెంట్లో సమంత కాస్త ఎమోషనల్ అయింది. ఈవెంట్ జరుగుతున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తన సినీ కెరీర్ని తలచుకొని సమంత ఎమోషనల్ కాగా,ఆమెని చూసి ఫ్యాన్స్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. ఇక శుభం చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి లాంటి నటీనటులు నటించారు.
நான் உன் அழகினிலே தெய்வம் உணருகிறேன்🎶
Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu#Subham #SubhamPreReleaseEvent #SubhamOnMay9 pic.twitter.com/QKUPjzwRy4— Samcults (@Samcults) May 5, 2025