Samantha Remunaration | ‘ఏమాయ చేశావే’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. మొదటి చిత్రంతోనే ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సినీ ప్రేక్షకుల నుండి సినీ ప్రముఖుల వరకు సమంత ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. ఈమె నటించిన సినిమాలు వరుసగా హిట్టవడంతో సమంతను టాలీవుడ్ గోల్డెన్ లెగ్గా పిలవడం మొదలుపెట్టారు. కెరీర్ మెదలు పెట్టినప్పటినుంచి ఇప్పటివరకు ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’ సినిమాలతో పాటు తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ‘కతువాకుల రెండు కదల్’ సినిమాలో నటిస్తుంది.
గతకొన్ని రోజులు నుండి సమంత, రౌడిబాయ్ విజయ్ దేవరకొండతో నటించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నట్లు కూడా సమాచారం. ఇదిలా ఉంటే ఆ చిత్రానికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ చిత్రానికి సమంత 3కోట్ల వరకు రెమ్యురేషన్ను డిమాండ్ చేస్తుందట. ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా సమంత అడిగిన పారితోషకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుతం రౌడిబాయ్ విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దీని తర్వాత కూడా పూరీ దర్శకత్వంలోనే విజయ్ ‘జనగణమన’ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే శివ నిర్వాణ చిత్రం పట్టాలెక్కనుందట.