Samantha| టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ ఆ తర్వాత నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంసారం సజావుగా సాగుతున్న సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి అతని నుండి విడిపోయింది. ఇక ప్రస్తుతం సింగిల్‌గా ఉంటుంది. ఇక చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంతకి మయోసైటిస్ అనే వ్యాధి బయటపడింది. చాలా రోజుల పాటు ఈ వ్యాధితో బాధపడ్డ సమంత సినిమాలకి కూడా బ్రేక్ ఇచ్చింది. అయితే చివరికి ఆ వ్యాధితో ధీటుగా ఎదుర్కొని మళ్లీ సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతుంది.
అయితే సమంత సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2010లో విడుదలైన ఏ మాయ చేసావే సినిమా ద్వారా సమంత ఆరంగేట్రం చేసింది. ఈ మూవీ ఫిబ్రవరి 26,2010న విడుదలై పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాలో సమంతతో చైతూ జంటగా నటించాడు. ఈ మూవీ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని టాక్. అయితే ఏ మాయ చేశావే సినిమా విడుదలై 15 ఏళ్లు కావడంతో, సమంత సినీ జర్నీ కూడా 15 ఏళ్లు పూర్తి అయింది. ఈ సినీ ప్రయాణంలో సమంత.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ , మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి అలరించిఆంది. తమిళంలో కూడా వరుస సినిమాలు చేసింది.
చివరిగా సమంత తెలుగులో ఖుషి, తమిళంలో కాతువాక్కుల రెండు కాదల్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాల తరువాత సమంత జీవితంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. విడాకులు, మయోసైటిస్ వ్యాధి , తండ్రి చనిపోవడం ఇలా సమంతని అనేక సమస్యలు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడిప్పుడే వాటి నుండి బయటపడుతున్న సమంత.. మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ద్వారా నిర్మాతగా కూడా పరిచయం కానుంది. ఈ క్రమంలోనే సమంత సినీ రంగంలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి కావడంతో తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను పంచుకుంటూ కృతజ్ఞతలు తెలిపింది. జీవితంలో ఎన్నో సవాళ్లని ఎదుర్కొన్న సమంత ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది