పదేళ్ల స్నేహం, మూడేళ్ల దాంపత్యానికి బ్రేక్ వేసిన సమంత- నాగ చైతన్య ఇప్పుడు పాత విషయాలన్నీ మరచిపోయి సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే సమంతకి సంబంధించి రెండు ప్రాజెక్టులు అనౌన్స్ కాగా, మరి కొన్ని సెట్స్ పై ఉన్నాయి. శాకుంతలం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక నాగ చైతన్య కూడా వరుస సినిమాలతో జోరు మీదున్నాడు.
ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక వచ్చే ఏడాది సమ్మర్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘థ్యాంక్యూ’ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్యూ సినిమా చిత్రీకరణ ఇప్పటికే ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు నాగార్జున బంగార్రాజు సినిమాను కూడా చైతూ చేసేందుకు సిద్దం అయ్యాడు. తండ్రి తో కలిసి ఇప్పటికే మనం సినిమాలో నటించిన చైతూ ఈసారి బంగార్రాజు సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమా ప్రేక్షకులకి మంచి వినోదం పంచనుందని అంటున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక సినిమాను చైతూ చేసేందుకు కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ హీరోగా ఓ సినిమా రానుందని అంటున్నారు. చూస్తుంటే ఇద్దరు పోటాపోటీగా సినిమాలు చేయనున్నారని తెలుస్తుంది.