Prabhas | టాలీవుడ్లో విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న సినిమాటిక్ యూనివర్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘హను-మాన్’ సినిమాతో ప్రారంభమైన ఈ యూనివర్స్, పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అనంతరం ‘జై హను-మాన్’లో రిషబ్ శెట్టీ ఎంట్రీతో ఈ యూనివర్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ యూనివర్స్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా అడుగుపెట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ‘బ్రహ్మరాక్షస్’ అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కే అవకాశముందని తెలుస్తోంది.
అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే, ప్రభాస్ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా ‘మహాకాళి’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఫీమేల్ సూపర్ హీరో నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమి శెట్టీ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక చిన్న కామియోలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కామియో ద్వారా ‘బ్రహ్మరాక్షస్’ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తే, పూర్తి స్థాయి ‘బ్రహ్మరాక్షస్’ సినిమా తెరకెక్కించే అవకాశముంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బ్రహ్మరాక్షస్ పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో కూడిన శక్తివంతమైన క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ పాత్ర PVCUలో కీలక మలుపు తీసుకురావచ్చని అంచనా. అయితే మరోవైపు, ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉందా లేదా అన్నదానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.