Samantha | ఇటీవలే శాకుంతలం (Shaakuntalam) సినిమాతో ప్రేక్షకులు, అభిమానులను పలుకరించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha). గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సామ్ ఫాలోవర్లకు నిరాశనే మిగిల్చింది. అయితే సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా జర్నీని కొనసాగించాలంటూ.. హితోపదేశం చేసిన సమంత తన నెక్ట్స్ హిందీ ప్రాజెక్ట్ సిటడెల్ (Citadel) వెబ్ సిరీస్ షూట్లో జాయిన్ అయింది. బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్ అండ్ టీంతో ఇంగ్లాండ్‌లో దిగిన స్టిల్‌ను ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా ఇప్పుడు బ్లాక్ అవుట్‌ఫిట్‌లో సరికొత్త లుక్‌లో దర్శనమిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇంతకీ స్పెషల్ ఏంటనుకుంటున్నారా..? బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కాంబోలో వచ్చిన సిటడెల్ లండన్ గ్లోబల్ ప్రీమియర్ ఈవెంట్‌కు సమంత హాజరైంది. బల్గరి స్నేక్ నెక్లెస్, బ్రేస్‌లెట్‌తో విక్టోరియా బెఖమ్ డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్‌లో కెమెరాకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సామ్. ఈ స్టిల్స్ నెటిజన్లను కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి.
రాజ్-డీకే దర్శకత్వంలో సిటడెల్ ఇండియన్ వెర్షన్లో వరుణ్‌ధవన్, సమంత నటిస్తున్నారని తెలిసిందే. సమంత మరోవైపు శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషిలో కూడా నటిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. సెప్టెంబర్ 1న థియేటర్లలో సందడి చేయనుంది.
బ్లాక్ అవుట్ ఫిట్‌లో సమంత..
The London skyline ft. #Samantha!🖤✨
The actress attended the premiere of #Citadel. pic.twitter.com/QYF3LpfwYf
— Filmfare (@filmfare) April 19, 2023
Team #Citadel India represent!🖤#Samantha and #VarunDhawan attended the London premiere of the show. pic.twitter.com/9bSxKrHsY8
— Filmfare (@filmfare) April 19, 2023